జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, రూపిరెడ్డిపల్లిలోని సహకార పరపతి సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే గండ్ర - Cereal buying centers are the latest news
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ప్రారంభించారు. రైతులు పండించిన పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలని సూచించారు. దళారులను నమ్మి... మోసపోవద్దని అన్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రా
రైతులు పండించిన పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలని సూచించారు. దళారులను నమ్మి... మోసపోవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి రైతు కొనుగోలు కేంద్రం ద్వారనే అమ్మకాలు జరుపుకోవాలని కోరారు.