తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి: భూపాలపల్లి కలెక్టర్ - bhupalapally mla

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని జయశంకర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారి డివైడర్​ మధ్యన హరితహారం నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి: భూపాలపల్లి కలెక్టర్

By

Published : Jul 15, 2019, 5:39 PM IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి డివైడర్​ మధ్యన చెట్లు నాటారు. గతేడాది జిల్లాలో 7 లక్షల మొక్కలు నాటినట్లు, ఈసారి కూడా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒక్కొక్కరు 3 మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సిగరేణి, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి: భూపాలపల్లి కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details