భూపాలపల్లి పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ అధ్యక్షతన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సేవాభావంతో ఏర్పాటైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ద్వారా జిల్లాలో అవసరమైన సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని సింగరేణి సంస్థ వారు అందించినందున.. ఆ స్థలాన్ని వెంటనే చదును చేసి కార్యాలయ భవన నిర్మాణానికి కమిటీని వేసి నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు.
'రెడ్‌క్రాస్ సొసైటీ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలి'
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయ భవన నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సొసైటీ ఆధ్వర్యంలో అవసరమైన సేవలు అందించేందుకు సమర్థవంతగా పనిచేయాలన్నారు.
తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించేందుకు విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అన్నారు. అలాగే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖలో సభ్యత్వాలను పెంచేందుకు జులై ఒకటో తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అనంతరం సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించి భూపాలపల్లి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించనున్న స్విమ్మింగ్ ఫూల్, భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన చెత్త డంపింగ్ యార్డ్ నిర్మాణంపై చర్చించి వాటి నిర్మాణానికి త్వరగా చర్యలు తీసుకోవాలని సింగరేణి జీఎం నిరీక్షన్ రాజ్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధార్ సింగ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈవీ శ్రీనివాస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మీ ఓటు వద్దు... ప్రేమానురాగాలు చాలు: మంత్రి పువ్వాడ