తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ కాలనీలో ఇంటివద్దకే సరుకులు' - భూపాలపల్లి జిల్లాలో తొలి కరోనా

కరోనాతో ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. నిన్న భూపాలపల్లి పట్టణం సుభాష్​కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది. ఆ కాలనీలో ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, నిత్యావసర సరుకులు, పండ్లు పంపిస్తామన్నారు.

Home Goods send to the home in subhash colony bhupalpally
'ఆ కాలనీలో ఇంటివద్దకే సరుకులు'

By

Published : Apr 4, 2020, 11:03 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని సుభాష్​కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కాలనీలో లాక్​డౌన్ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అబ్దుల్ అజీం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు చర్యగా అతను కలిసిన తన భార్య, కూతురుతో కలిపి మొత్తం 39 మందిని గుర్తించామన్నారు. వారిలో 21 మందిని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి, మరో 18 మందిని కాళేశ్వరం క్వారంటైన్ కేంద్రానికి పంపించామని తెలిపారు.

ఇంటికే సరుకులు

మొత్తం సుభాష్​కాలనీ 850 ఇళ్లు ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వారికి కావల్సిన నిత్యావసర సరుకులు, పండ్లు పంపిస్తామన్నారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సుభాష్ కాలనీ, కాళేశ్వరంలో ఒక కిలోమీటర్ మేర కంటోన్మెంట్ జోన్లుగా గుర్తించి లాక్​డౌన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

భయం వద్దు..

ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావొద్దని, జిల్లాలో ఒకటే పాజిటివ్​ కేసు నమోదైందని వివరించారు. పోలీసు, వైద్యశాఖ, జిల్లా అధికారులు అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారని అన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండి లాక్​డౌన్​కు సహకరించాలని ప్రజలను కలెక్టర్కోరారు.

'ఆ కాలనీలో ఇంటివద్దకే సరుకులు'

ఇదీ చూడండి :కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details