జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో వర్షం విస్తారంగా కురుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా 11 మండలాల్లో ఈదురుగాలులు... ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది.
జయశంకర్ భూపాలపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం - జయశంకర్ భూపాలపల్లి జిల్లా వర్షాలు
జయశంకర్ భూపాలపల్లిలో విస్తారంగా వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జయశంకర్ భూపాలపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం
కారు మబ్బులు కమ్ముకొచ్చి కురుస్తోన్న వర్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, మలహల్ రావు, పాలిమల మండలాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది.