అకాల వర్షాలు అన్నదాతలను ముంచేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ, ఘనపురం, మొగుళ్లపల్లి మండలాల్లో అకాల వర్షాలతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. లానినో ప్రభావంతో అతివృష్టి వల్ల అధిక వర్షాలు కురుస్తుండటం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న, మిరపతో పాటు మరికొన్ని పంటలు దెబ్బ తిన్నాయి. పెట్టిన పెట్టుబడులు అధికమై దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికైనా పంటలను అధికారులు పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నదాతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన మక్కలు, పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
అకాల వర్షాలతో నష్టపోతున్న అన్నదాతలు - అకాల వర్షాలతో నష్టపోతున్న అన్నదాతలు
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను వరుణుడు కంటతడి పెట్టిస్తున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తడిచిన మక్కలు, పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
అకాల వర్షాలతో నష్టపోతున్న అన్నదాతలు