జయశంకర్ భూపాలపల్లి జిల్లా రంగయ్యపల్లి, చిన్నకొడపాక, రూపిరెడ్డి పల్లి, కనిపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో కాసేపు వడగళ్ల వాన కురిసింది. వర్షానికి అక్కడక్కడ ఆరబోసిన మక్కలు, వరి ధాన్యం తడిశాయి.
వడగళ్ల వాన.. తడిసిన ధాన్యం - వడగళ్ల వాన
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల ఆరబోసిన మక్కలు, వరి ధాన్యం తడిశాయి. రైతులకు నష్టాన్ని మిగిల్చాయి.
Breaking News
భూపాలపల్లి, ఘనపూర్, చిట్యాల, టేకుమట్లా, మొగుళ్లపల్లి మండలాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని, మక్కలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి :నగరంలో పెరుగుతున్న గృహహింస కేసులు