జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద గోదావరి నదిలో సాగే వినాయక నిమజ్జనోత్సవాలకు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో కాళేశ్వరం గోదావరి బ్రిడ్జి పైనా, ఘణపూర్ గణపసముద్రం చెరువు వద్ద ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చర్యలు చేపట్టారు. మొత్తం 80 మంది పోలీసుల బందోబస్తుతో వినాయక నిమజ్జనం సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడిషనల్ ఎస్పీ సాయి చైతన్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గతేడాది 800 విగ్రహాల నిమజ్జనం అవగా.. ఈసారి ఎక్కువగా వినాయకులు వస్తాయని అధికారులు తెలిపారు.
కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద భారీ బందోబస్తు - 80 మంది సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 80 మంది సిబ్బందితో గణేశ్ నిమజ్జనం సాగుతోంది.
కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద భారీ బందోబస్తు
ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత