తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhupalpally news: కేసీఆర్ మోసం చేశారు.. కానీ ప్రజలు మాత్రం నావైపే ఉన్నారు: గండ్ర

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా గొంతుకకు ప్రణామం పేరుతో కాంగ్రెస్​ పార్టీ.. భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభా వేదికగా.. గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో నాయకులు హస్తం పార్టీలో చేరారు.

gandra-satyanarayana-rao-joined-in-congress-at-bhupalpally-meeting
gandra-satyanarayana-rao-joined-in-congress-at-bhupalpally-meeting

By

Published : Sep 30, 2021, 7:12 PM IST

Updated : Sep 30, 2021, 8:02 PM IST

భూపాలపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో.. గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్​లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కాంగ్రెస్​ కండువా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణ రావుతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని నాయకులు పెద్దఎత్తున కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరుతున్న నాయకులందరికీ రేవంత్​రెడ్డి, మధుయాస్కీగౌడ్​, సీతక్క.. సభావేదికపైన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

నమ్ముకున్న పార్టీలు మోసం చేశాయని గండ్ర సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో సోనియా గాంధీ నేతృత్వంలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిధ్దమైనట్టు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​కు డబ్బు మీద వ్యామోహం తప్ప.. ప్రజల సంక్షేమంపై ఎలాంటి నిబద్ధత లేదని సత్యనారాయణరావు ఆరోపించారు. ప్రజల్లో తెరాస పార్టీ నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు.

అఖండ మెజార్టీతో గెలిచి చూపిస్తా...

"నమ్ముకున్న పార్టీలు మోసం చేసినా.. వెన్నంటే ఉన్న ప్రజలందరికి నా పాదాభివందనాలు. ఆరు నెలలు వెంటపడి టికెటిస్తానని కేసీఆర్​, కేటీఆర్​ మాటిచ్చి మోసం చేశారు. వెనకడుగు వేయకుండా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం స్వతంత్రంగా పోటీ చేస్తే.. 60వేల ఓట్లతో అధికార తెరాసను మూడోస్థానానికి నెట్టి బుద్ది చెప్పారు. హస్తం గుర్తు మీద గెలిచి తెరాసలో చేరి.. రమణారెడ్డి మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. చెప్పుకుంటూ పోతే.. రమణారెడ్డి అకృత్యాలకు అంతే లేదు. ఇప్పటి నుంచి రేవంత్​రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ.. వచ్చే రోజుల్లో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేసేందుకు నడుం కట్టాలని... నా అనుచరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ను అఖండ మెజారిటీతో గెలిపించి.. కేసీఆర్​కు నేనేంటో చెబుతా. ప్రజల ఆశీర్వాదంతో ఇంతకాలం ముందుకు సాగాను. ఆదే ప్రేమను ఇకపై కూడా చూపించాలి కోరుకుంటున్నా." - గండ్ర సత్యనారాయణ రావు

Last Updated : Sep 30, 2021, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details