కరోనా వైరస్ ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతున్నందున... ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. చేతులను ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఏదైనా అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని... లేదంటే ఇంట్లోనే ఉండాలని ప్రజలను కోరారు.
'అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆలోచించాలి' - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోందిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ చర్యలతోపాటు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు.
రైతులు వరి,మక్కలు,మిర్చి, పంటలే కాకుండాప్రత్యామ్నాయ పంటలవైపు పయనించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎంతో ఆలొచించి ప్రత్యామ్నాయ పంటగా,సన్న రకం ధాన్యం,ఫామాయిల్ పంటలను పండించాలి అని సూచించడం జరిగిందని పేర్కొన్నారు.
జయశంకర భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్లులు తక్కువగా ఉండడం వల్ల... పక్క జిల్లాలోని రైస్ మిల్లులకు ధాన్యం, మక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హమాలీల సమస్య ఉండడం వల్ల దిగుమతి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనైన సరే ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులు కూడా కొంత ఓపికతో ఉండాలని సూచించారు.