తెలంగాణ

telangana

ETV Bharat / state

'వీఆర్ఓ.. లంచం తీసుకొని మోసం చేశాడు'

భూమి పట్టా చేయడానికి వీఆర్ఓ నగదును డిమాండ్​ చేశాడంటూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని రైతులు ఆరోపించారు. గతంలో తమ నుంచి డబ్బు తీసుకొని కూడా పనిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Farmers in Bhupalpally regonda alleged that VRO demanded Bribe for land deed.
'వీఆర్ఓ.. లంచం తీసుకొని మోసం చేశాడు'

By

Published : Jan 5, 2021, 5:40 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాగిర్తిపేట గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. వీఆర్వో కాలరామ్​ నాయక్.. ఎకరానికి పట్టా చేయడానికి రూ.10 వేలను తమ వద్ద డిమాండ్ చేసి, భూమి పట్టా చేయడం లేదంటూ వాపోయారు.

తక్షణమే విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. భూములను పట్టా చేయాలంటూ ఎమ్మార్వోను కలిసి వినతిపత్రం అందజేశారు.

వీఆర్ఓపై విచారణ చేపట్టి, కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్వో స్పష్టం చేశారు. ధరణి అందుబాటులోకి రాగానే.. రైతుల భూములను పట్టా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:ఎమ్మార్వో ఆఫీసు పైకెక్కి వృద్ధజంట ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details