తెలంగాణ

telangana

ETV Bharat / state

Pranahitha pushkaralu: ప్రాణహితకు ఆధ్యాత్మిక శోభ.. పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం - Pranahita River pushkars

ప్రాణహిత నదీ తీరం భక్తులతో కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్​, మహారాష్ట్ర నుంచి పుష్కరఘాట్లకు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని భారీగా దర్శించుకోవడంతో ఆలయంలో రద్దీ పెరుగుతోంది.

ప్రాణహితకు ఆధ్యాత్మిక శోభ.. పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం
ప్రాణహితకు ఆధ్యాత్మిక శోభ.. పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం

By

Published : Apr 15, 2022, 5:57 AM IST

Updated : Apr 15, 2022, 6:23 AM IST

గోదావరి ఉపనది అయిన ప్రాణహిత నది పుష్కరఘాట్లలో భక్తుల సందడి నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమం, మహారాష్ట్రలోని సిరోంచ, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి పుష్కర ఘాట్లు కోలాహలంగా మారుతున్నాయి. మండుటెండనూ లెక్క చేయకుండా వస్తున్న భక్తులు గంగమ్మకు సారె పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకుంటున్నారు.

ప్రాణహితకు ఆధ్యాత్మిక శోభ.. పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం

వేసవి వేళ పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులు ఎండలతో అవస్థలు పడుతున్నారు. తీరం వద్దకు నడుచుకుంటూ రావడానికి వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. పెద్ద ఎత్తున కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దర్శనానికి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గురువారం ఒక్కరోజే దాదాపు రూ.6.5 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Last Updated : Apr 15, 2022, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details