జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. 1,358 మందికి పరీక్షలు శనివారం నిర్వహించినట్లు వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్కరోజే 98 కరోనా కేసులు
భూపాలపల్లి జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరో 98 మందికి వైరస్ సోకిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 5,763మందికి టీకా ఇచ్చినట్లు వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కేసులు, కొవిడ్ పాజిటివ్ కేసులు
భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 5 వేల 763 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మమతాదేవి తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:కరోనాకు బ్రేక్.. ఒక్క మాస్క్ చాలదా?