జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి కార్మికుడికి(52) కరోనా సోకినట్లు కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. ఈనెల 18న దిల్లీ నుంచి భూపాలపల్లికి వచ్చిన ఆయన 19 నుంచి 28 వరకు విధులకు వెళ్లారు. ఈనెల 30న అతని రక్త నమూనాలు సేకరించి కాళేశ్వరంలోని క్వారంటైన్‌కు తరలించారు.
భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ - భూపాలపల్లిలో కరోనా పాజిటివ్ కేసు
ప్రశాంతంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కొవిడ్-19 కలవరపెడుతోంది. నిన్న జిల్లా కేంద్రంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ సింగరేణి కార్మికుడికి(52) కరోనా సోకినట్లు కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్
శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే ఆయనతో ఉన్న ప్రాథమిక సంబంధీకులను 37 మందిని గుర్తించారు. కాళేశ్వరంలో ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు 18 మందిని, మరో 19 మందిని జిల్లా కేంద్రంలోని నూతన 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చూడండి :కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు