జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో మొత్తం 10 సహకార సంఘాలు ఉండగా.. అందులో 2 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8 సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు - latest news on cooperative elections in j jayashanker bhupalapally
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు
ఎన్నికల బరిలో 172 మంది అభ్యర్థులు ఉండగా.. సుమారు 31 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు
ఇదీ చదవండి : కుమార్తెకు పెళ్లి కానుకగా ఎడ్ల బండిలో 2200 పుస్తకాలు