జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సైకిల్ తొక్కుతూ గ్రామాభివృద్ధి పనులు పరిశీలించారు.
పల్లెల ప్రగతి... పడతుల చదువుతోనే... - jayashankar bhupalpally collector
గ్రామాల్లో ఉన్న మహిళలు చదువుకోవాలని అప్పుడే పల్లెలు ప్రగతి పథంలో ముందుకెళ్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.
పల్లెల ప్రగతి... పడతుల చదువుతోనే...
గ్రామాల్లోని మహిళలు చదువుకున్నప్పుడే పల్లెలు ప్రగతి పథంలో ముందుకెళ్తాయని కలెక్టర్ తెలిపారు. చిట్యాలలో చదువుకోని మహిళలకు పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వెంకటేశ్వర్లు అన్నారు.