తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా వర్షాలు... బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

Coal Production stopped in Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గనుల్లోకి వరద నీరు చేరింది. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిలో అంతరాయం వల్ల కోట్ల రూపాయల్లో సింగరేణికి నష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Coal Production stopped in Bhupalpally
Coal Production stopped in Bhupalpally

By

Published : Jun 21, 2022, 1:25 PM IST

Coal Production stopped in Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి సింగరేణి కాలరీస్‌లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లోకి వర్షపు నీరు చేరింది. దీనివల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓపెన్ కాస్ట్ 1,2,3 గనుల్లోకి నీరు చేరింది. నేత తడిగా ఉండటం వల్ల డంపర్, వోల్వో లారీలు బోల్తా కొట్టే అవకాశం ఉండడంతో సింగరేణి అధికారులు మొదటి షిప్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిపి వేశారు.

గనుల్లోకి చేరిన వరద నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. వరద నీటి వల్ల రాత్రి షిఫ్ట్ పనులు నిలిపివేశామని.. ఇవాళ రెండో షిఫ్ట్ నుంచి పనులు జరుగుతాయని అధికారులు తెలిపారు. వర్షం నీరు గనుల్లోకి చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి సింగరేణికి కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details