పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారనే సమచారం అందుకున్న గణపురం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవి నగర్, మైలారం ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండగా.. 8 లారీలు, 2 జేసీబీలను సీజ్ చేసి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా కఠిన చర్యలు తీసుకుంటామని గణపురం ఎస్ఎచ్ఓ ట్రైనీ హెచ్చరించారు.
అక్రమ తవ్వకాలకు పాల్పడిన చల్లా అనుచరులపై కేసు నమోదు - illegal diggings in ganapuram jaya shankar bhupalapally district
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారనే సమచారం అందుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడిన వారెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అక్రమ తవ్వకాలకు పాల్పడిన చల్లా అనుచరులపై కేసు నమోదు