పశువులు చనిపోయే పరిస్థితి
వేసవిలో మూగజీవాల దాహం తీరేదెలా..? - jayshankar
మార్చిలోనే భానుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు నీటి సదుపాయం లేక మనుషులతో పాటు పశువులు అల్లాడుతున్నాయి. జయశంకర్ జిల్లాలో మూగ జీవాలపై బతికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ద్వారా నీళ్లు వదిలి చెరువులను నింపాలని అధికారులను కోరుతున్నారు.
మూగ జీవాలు
పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో కుంటల్లో నీళ్లు లేక అవి చనిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మేసే ప్రాంతాల్లో కుంటలు ఏర్పాటు చేసి నీరందించాలని కోరుతున్నారు. గొర్రెల, బర్రెల సంరక్షణకు పశువైద్యుల నుంచి కూడా ఎలాంటి సూచనలు అందడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు స్పందించి మూగజీవాల సంరక్షణ చర్యలు చేపట్టాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.
ఇదీ చదవండి :"నామీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగిందో"