జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ జాతీయ రహదారిపై ఓ కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహాముత్తారం మండలం పెగడపల్లికి చెందిన అటవీ శాఖ అధికారి ముషీర్, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. మహాదేవపూర్ నుంచి కాటారం వైపునకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారు ఇంజిన్లో చెలరేగిన మంటలు... దగ్ధమైన వాహనం
మహాదేవపూర్ జాతీయ రహదారిపై ఓ కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై గమనించి కారును ఆపడం వల్ల ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
కారు ఇంజిన్లో చెలరేగిన మంటలు... దగ్ధమైన వాహనం
మహదేవపూర్ ఎస్సై అనిల్ కుమార్ బొమ్మాపూర్ మూలమలుపు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కారులో నుంచి మంటలు చెలరేగుతుండగా గమనించి వాహనాన్ని కొంత దూరం వెంబడించారు. వాహనం ఆపి వారిని కిందకు దింపారు. క్షణాల్లోనే మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. మహాదేవపూర్ ఎస్సై అనిల్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించడంపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.
ఇవీ చూడండి: రూ.2 లక్షల 57 వేల విలువైన గుట్కాను పట్టుకున్న పోలీసులు