జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో 'భూ పరిష్కార వేదిక.. రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది ' అనే పేరుతో వినూత్న కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఇతర రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. జిల్లాలో 93 శాతం డిజిటల్ సంతకాలు చేశామని, మిగతా 7 శాతం వివిధ సమస్యల వల్ల ఆలస్యమవుతోందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారి సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు.
'భూ పరిష్కార వేదిక-రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది '
రైతుల సమస్యలు పరిష్కారించే దిశగా భూపాలపల్లి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'భూ పరిష్కార వేదిక-రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది' కార్యక్రమంతో గ్రామాల్లో సభ నిర్వహించి అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తున్నారు.
'భూ పరిష్కార వేదిక-రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది '