ఆర్టీసీ సమ్మెపై స్పందించిన తెరాస ఎమ్మెల్యే - jangon mla respond on rtc strike
ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఆర్టీసీ కార్మికుల జీవితాలను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విమర్శించారు.
ఆర్టీసీ సమ్మెపై స్పందించిన తెరాస ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని లాభాల బాటలో నడపాలని ఆలోచనలు చేస్తుంటే... ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొట్టి సమ్మె వైపు నడిపించాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పెద్ద మనసుతో రెండు సార్లు అవకాశం కల్పించినా.. విపక్షాలు దీని ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే కార్మికుల జీవితాలతో అడుకున్నాయన్నారు. ప్రతిపక్షాలకు వేదిక లేకపోవడం వల్లనే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.