జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మాకూరులో విషాదం చోటుచేసుకుంది. అదే జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన అవినాశ్ భార్యతో సహా మరో ఇద్దరు మరదళ్లతో కలిసి బొమ్మాకూరు జలాశయం వద్దకు వెళ్లారు. ఉదయం వెళ్లిన వారంతా జలాశయం వద్ద ఉల్లాసంగా గడిపారు. ఫొటోలు దిగేందుకు నీటిలోకి దిగారు. భార్య ఫొటో దింపుతానని చెప్పగా...అవినాశ్ ఇద్దరు మరదళ్లతో కలిసి నీటిలోకి వెళ్లారు. ఇంతలోనే ప్రమాదశవశాత్తు పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయారు. భార్య చూస్తుండగానే ముగ్గురు నీళ్లలో మునిగిపోయారు. గట్టుపై వున్న భార్య దివ్య కేకలు వేయడంతో స్థానికులు జలాశయం వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
విషాదం