తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థికసాయం - ఈటీవీ కథనానికి స్పందన

రోడ్డు ప్రమాదంలో కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైన వాలీబాల్​ మాజీ క్రీడాకారుడికి ఓ సామాజిక కార్యకర్త ఆర్థిక సాయం అందించారు. క్రీడాకారుడు అనిల్​ కష్టాలపై ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించిన వేదవల్లి చంద్రప్రకాష్​ రూ.5వేలు ఆర్థికసాయం చేశారు.

ఈటీవీ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థికసాయం
ఈటీవీ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థికసాయం

By

Published : Sep 23, 2020, 9:18 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన శాతపురం అనిల్ గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. వాలీబాల్​ క్రీడాకారుడిగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అనిల్​ వ్యథపై ఈటీవీలో వచ్చిన కథనానికి ఓ సామాజిక కార్యకర్త స్పందించారు.

సామాజిక కార్యకర్త వేదవల్లి చంద్రప్రకాష్... బాధితుడికి రూ.5వేలు ఆర్థిక సాయం చేశారు. తన పరిస్థితి చూసి ఆర్థికంగా అండగా నిలిచిన చంద్రప్రకాష్​కు... అనిల్​ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!

ABOUT THE AUTHOR

...view details