జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగరం గ్రామానికి చెందిన బాషబోయిన రమేష్ గొర్రెలు పెంచుతున్నాడు. ఈ గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 33 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మిగిలిన గొర్రెలు గాయాలపాలయ్యాయి.
కుక్కల దాడిలో 33 గొర్రెలు మృతి.. రూ.3లక్షల నష్టం - 33 గొర్రెలు మృతి
కుక్కులు దాడి చేసిన ఘటనలో 33 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన తరిగొప్పుల మండలంలో చోటు చేసుకుంది. సుమారు మూడు లక్షల నష్టం జరిగిందని... ప్రభుత్వం తమను కాపాడుకోవాలని గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు.
కుక్కల దాడిలో 33 గొర్రెలు మృతి
విగతజీవులుగా పడి ఉన్న గొర్రెలను చూసి రమేష్ బోరున విలపించాడు. దాదాపు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లందని పేర్కొన్నాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నాడు.