జనగామ జిల్లాలో బుధవారం నిర్వహించే పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకుడు డాక్టర్ పోచయ్య చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాలీసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
బుధవారం నిర్వహించే పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకుడు డాక్టర్ పోచయ్య తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 565 మంది, ఏకశిలా డిగ్రీ కళాశాలలో 112 మంది, గాయత్రీ డిగ్రీ కళాశాలలో 226 మంది, స్టేషన్ ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 197 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 88 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు