లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడంలో సంతోషం కలుగుతోందని నెలుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెలుట్ల రవీందర్రావు అన్నారు. జనగామ జిల్లా లింగాలఘన్పూర్ మండలం నవాబ్ పేటలో నెలుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 పేద కుటుంబాలకు నిత్యావసర సరకులను ఆయన పంపిణీ చేశారు.
పేదలకు నెలుట్ల ఫౌండేషన్ ఆపన్నహస్తం
లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను పలువురు దాతలు ఆదుకుంటున్నారు. జనగామ జిల్లా నవాబ్‌పేటలో 50 పేద కుటుంబాలకు నెలుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ రావు సరకులను పంపిణీ చేశారు.
groceries distribution
గత కొన్ని రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో రోజూవారి కూలీలు ఆకలితో బాధపడుతున్నారని రవీందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 19 గ్రామాల్లోని పేదలకు సరకులను పంపిణీ చేశామన్నారు.
ఇవీ చూడండి: జనగామలో మరో వలసకూలీకి కరోనా పాజిటివ్