జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో లెదర్ పార్కు వద్ద హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ ఛైర్పర్సన్ పాకాల సంపత్, ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. 15,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటడం తోపాటు సంరక్షణపైనా దృష్టిసారించాలని కోరారు. జనగామ జిల్లాను హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, డీఆర్డీవో పీడీ రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
'జనగామ జిల్లాను హరితవనంగా మార్చాలి'
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లెదర్‌పార్క్ వద్ద హరితహారం నిర్వహించారు. జనగామ జిల్లాను హరితవనంగా మార్చేందుకు అందరూ కృషిచేయాలని జడ్పీ ఛైర్మన్ సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విజ్ఞప్తి చేశారు.
'జనగామ జిల్లాను హరితవనంగా మార్చాలి'