జనగామ జిల్లా కేంద్రంలోని రంగప్ప చెరువు.. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో నింపారు. స్థానిక శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామకు సమీపంలో ఉన్న రంగప్ప చెరువును పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. గతంలో జనగామలోని బతుకమ్మ కుంటను ప్రజల సహకారంతో ఎలా సుందరంగా తీర్చిదిద్దామో... అదే విధంగా రంగప్ప చెరువును కూడా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ సుందరీకరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు.
రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
గోదావరి జలాలతో నిండిన జనగామ రంగప్ప చెరువును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి