పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అభ్యర్థుల తరఫున మంత్రులు మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ముస్లింల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని... ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని హోం మంత్రి మహ్మద్ అలీ పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపాలు మాయమాటలు తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
'తెరాసతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం' - Ministers Mahamood Ali,Erraballi Dayakar Rao Municipal Election Campaign in Janagama
జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం కార్యకర్తల సమావేశంలో మంత్రులు మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు.
'తెరాసతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం'
జనగామ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని... అభివృద్ధి జరగాలంటే తెరాసతోనే సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ముస్లింల ఆర్థిక ప్రగతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని, షాది ముబారక్ ద్వారా పేద ముస్లింలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి: విరసం కార్యదర్శి కాశీంను హాజరుపర్చండి: హైకోర్టు ఆదేశం