'మొక్కలు నాటుదాం... వాతావరణాన్ని పరిరక్షిద్దాం' అనే సూక్తిని నెరవేర్చాలని, తెలంగాణ అంతటా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నవాబుపేటలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని ఈత, తాటి, ఖర్జూర మొక్కలు నాటారు. జనగామ జిల్లా కేంద్రంగా తెలంగాణ ఉద్యమం నిరంతరం సాగేదని... ఉద్యమ ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ రాకముందు ఎడారిగా ఉన్న రాష్ట్రం... నేడు ఎక్కడ చూసినా జలకళతో మరో కోనసీమగా మారిందన్నారు.
హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి - హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రమంతటా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా నవాబుపేటలో మంత్రి ఈత, తాటి, ఖర్జూర మొక్కలను నాటారు.
హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేయాలనే తెలంగాణ భగీరథుడిగా మారి అనేక ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువుల మరమ్మత్తులు చేయిస్తున్నారన్నారు. వీటి ద్వారా చెరువులు నిండి రైతుల ముఖంలో సంతోషం చూస్తున్నామన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంతోపాటు సంక్షేమ పథకాల అమలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఇవీ చూడండి:పచ్చని పట్టణాలే లక్ష్యంగా.. 'గ్రీన్ స్పేస్ ఇండెక్స్'