కరోనా కష్టకాలంలో రంజాన్ పండుగ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల ఎంపీడీవో కార్యాలయంలో ముస్లింలకు ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ముస్లిం సోదరులు భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలన్నారు.
ముస్లింలకు సరకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి - జనగామ జిల్లా వార్తలు
జనగామ జిల్లా దేవరుప్పుల ఎంపీడీవో కార్యాలయంలో ముస్లింలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.
రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కాంగ్రెస్, భాజపా పాలిత ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో కాంగ్రెస్, భాజపాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో రైతుబంధు, రుణమాఫీ చేసిన మహాత్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి రైతులు అధిక దిగుబడి పొందాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు.