తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం: ఎర్రబెల్లి - trs Government Latest News

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండల కేంద్రంలో నాలుగు వందల మంది రైతులకు మినీ డైరీ కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి మంజూరు చేస్తూ.. ధ్రువపత్రాలను అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

Minister Errabelli Latest News
Minister Errabelli Latest News

By

Published : Sep 26, 2020, 4:28 PM IST

పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది రైతులకు మినీ డైరీ కేంద్రాలను మంజూరు చేస్తూ ధ్రువపత్రాలను అందజేశారు.

అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి పేదలను ఆదుకుంటున్నారని కొనియాడారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్​ సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:అశ్రునయనాలతో బాలూకు అంతిమ వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details