దేశంలో ఏ రాష్ట్రానికి దక్కని విధంగా తెలంగాణకు 12 అవార్డులు రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లెప్రగతితో పల్లెలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని అన్నారు. డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం అవార్డులు సీఎం ముందు చూపునకు నిదర్శనం
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రావడం సంతోషంగా ఉందని... మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కానీ అవార్డులు ఇస్తున్న కేంద్రం... గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా మోసం చేస్తోందని విమర్శించారు.
జనగామ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి
గత ఏడాది గ్రామ పంచాయతీలకు రూ.1,847 కోట్లు కేంద్రప్రభుత్వం కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. కానీ ఈ సారి బడ్జెట్‌లో కేవలం రూ.1,360 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. అవార్డులు ఇస్తున్న కేంద్రం... నిధులలో కోత ఎందుకు విధిస్తుందో అర్థం కావడం లేదని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర సర్కారుకు లేఖ పంపించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన 27 మందికి కరోనా
Last Updated : Apr 1, 2021, 9:58 PM IST