తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేయడమే సీఎం లక్ష్యం' - చేప పిల్లలను వదిలిన ఎర్రబెల్లి దయాకర్ రావు

మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చెరువులో చేప పిల్లలను మంత్రి వదిలారు. తెరాస పాలనతోనే కుల వృత్తులకు ప్రాధాన్యత వచ్చిందన్నారు.

errabelli dayakar rao
errabelli dayakar rao

By

Published : Aug 25, 2020, 4:30 PM IST

మత్స్యకారుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం సీఎం కేసీఆర్ మానస పుత్రికని... ఈ ప్రాజెక్టుతో గ్రామాలకు జలకళ వచ్చిందని పేర్కొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చెరువులో చేప పిల్లలను మంత్రి ఎర్రబెల్లి వదిలారు. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేయాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి అన్నారు.

తెరాస పాలనతోనే కుల వృత్తులకు ప్రాధాన్యత వచ్చిందని వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తపడాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎర్రబెల్లి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details