జనగామ జిల్లాలోని మరిగడి గ్రామస్థులు ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. కాలువలు పూర్తి చేసి, గ్రామంలోని చెరువులకు గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెజస అధ్యక్షుడు కోదండరాం మరిగిడి గ్రామస్థులకు మద్దతు తెలిపారు. గత పది సంవత్సరాల నుంచి గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని సర్పంచ్ తెలిపారు. బతుకుతెరువు కోసం పక్క గ్రామాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
మరిగడి గ్రామస్థుల ధర్నాకు కోదండరాం మద్దతు - marigadi village
నిర్మాణంలో ఉన్న కాలువలను త్వరగా పూర్తిచేసి గోదావరి జలాలతో చెరువులను నింపాలని మరిగడి గ్రామస్థులు ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. తెజస అధ్యక్షుడు కోడందరాం వారికి మద్దతు తెలిపారు.
మరిగడి గ్రామస్థుల ధర్నాకు కోదండరాం మద్దతు