తెలంగాణ

telangana

ETV Bharat / state

బండరాళ్ళు కూలీ ఒకరు మృతి - dead

బండరాళ్లు కూలి ఓ కూలీ మృతి చెందిన ఘటన జనగామలో జరిగింది. రాళ్లను టిప్పర్​లో వేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కూలీ మృతి

By

Published : Jun 7, 2019, 6:45 PM IST

జనగామ మండలం చంపక్ హిల్స్ గుట్టల్లో క్రషర్ మిషన్ వద్ద బండరాళ్ళు కూలి ఓ కూలీ మృతి చెందాడు. జోగులంబ జిల్లా గద్వాల మండలం ఈడుగోనిపల్లి గ్రామానికి చెందిన ఆవుల తిరుమలేశ్​ రెండు నెలల క్రితం క్రషర్ వద్ద టిప్పర్​ డ్రైవర్​గా పనికి కుదిరాడు. తిరుమలేశ్​ గుట్టపై ఉన్న బండరాళ్లను టిప్పర్​లో వేసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పెద్ద బండరాళ్లు పైనుంచి జారిపడడం వల్ల వాటిమధ్య తిరుమలేశ్​ ఇరుక్కుపోయి... అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదాన్ని గమనించిన మరో టిప్పర్ డ్రైవర్ వెంకటయ్య యజమానులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

బండరాళ్ళు కూలి ఒకరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details