మజ్లీస్ పార్టీతో స్నేహాపూర్వక సంబంధం పెట్టుకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. జనగామలో పార్టీ నేతలు, కార్యకర్తలను కలిశారు. షేక్ బందంగి, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి లాంటి వారు రాజకారులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలు విడిచారని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణకు స్వాతంత్య్రం తీసుకొచ్చిన అమరవీరుల చరిత్రను భావితరాలకు తెలియనీయకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేశారు.
'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి' - bjp
రాష్ట్ర ప్రభుత్వం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల చరిత్రను భావితరాలకు తెలియకుండా... తెరాస కుట్ర పన్నుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.
లక్ష్మణ్