వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌దే ప్రధాన పాత్ర: ఎంపీ నర్సయ్య గౌడ్
60 సంవత్సరాల్లో జనగామకి సరైన న్యాయం జరగలేదని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. సాధించుకున్న జిల్లాను అభివృద్ధి చేసుకోవటంతో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. జనగామలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి ప్రారంభించారు. నగర అభివృద్ధికి మంజూరైన 30 కోట్ల నిధులతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం తదితర పనులను చేపట్టినట్లు నర్సయ్యగౌడ్ తెలిపారు. ఆరు నెలల క్రితమే నిధులు మంజూరైనా ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయన్నారు. మళ్లీ ఎన్నికల కోడ్ అమలు కాకముందే పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.