గత మూడు నెలలుగా కపిల్ చిట్స్ సిబ్బంది తనకు చెల్లించాల్సిన లక్షా 19వేల రూపాయలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన రఘుపతి ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి తాళం వేసి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన మాయమాటలు చెబుతున్నారని తనకు రావాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కపిల్ 'చీట్' చేస్తోంది: బాధితుడు - kapil_chits fraud
రూపాయి..రూపాయి కూడబెట్టుకుని కపిల్ చిట్స్ కంపెనీలో జమ చేస్తే ఇప్పుడు తనకు రావల్సిన డబ్బులు ఇవ్వటం లేదని జనగామలో ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు.
కపిల్ 'చీట్' చేస్తోంది: బాధితుడు