తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు కడియం శ్రీహరి కృతజ్ఞతలు - సీఎం కేసీఆర్​కు కడియం శ్రీహరి కృతజ్ఞతలు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జె.చొక్కారావు గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా సేద్యపు నీటిని అందించడం వల్లే 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండించడం సాధ్యమైందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు.

kadiam says thanks to cm kcr
సీఎం కేసీఆర్​కు కడియం శ్రీహరి కృతజ్ఞతలు

By

Published : May 23, 2020, 4:42 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జె.చొక్కారావు గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా సేద్యపు నీటిని అందించడం వల్లే పంటలు చాలా బాగా పండాయని సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇందుకు సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ రంగానికి కేటాయిస్తూ 100 టీఎంసీల నీటిని ప్రాజెక్టు అవసరాల నిమిత్తం కేటాయించటం చాలా సంతోషంగా ఉందన్నారు.

జిల్లాలోని స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి లాంటి కరువు పీడిత ప్రాంతాలకు నీరు అందడం వల్లే 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండించడం సాధ్యమైందని కడియం తెలిపారు. మల్లన్న గండి కాలువ తవ్వితే 7700 ఎకరాల విస్తీర్ణంలో సేద్యపు నీటి సదుపాయం కలుగుతోందని పేర్కొన్నారు.వేలేరు మండలం మద్దెల గూడెం, తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామాలకు వరద కాలువ ద్వారా నీటి సదుపాయం కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

ABOUT THE AUTHOR

...view details