ఘనంగా జన విజ్ఞాన వేదిక తృతీయ ప్లీనం సమావేశాలు - జనగామ
జనవిజ్ఞాన వేదిక 3వ వార్షిక ప్లినం సమావేశాలు జనగామ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. గత 31 సంవత్సరాలుగా రాష్ట్రం చేస్తున్న సేవల గురించి వక్తలు కొనియాడారు.
జనగామ జిల్లా కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక 3వ వార్షిక ప్లీనం సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 225 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు హాజరయ్యారు. గత 31 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను అమాయకత్వం, మూఢనమ్మకాలనుంచి బయటపడేసేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోందని, ప్రభుత్వంతో కలిసి అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహిస్తూ అక్షరాస్యతను పెంపొందించేందుకు పాటుపడుతోందని తెలిపారు. పోలీస్ శాఖతో కలిసి మూఢనమ్మకాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోందని తెలిపారు.