తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం... అన్నదాతలకు అపార నష్టం - అకాల వర్షం

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమవగా.. సాయంత్రం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఈ వానతో పండ్ల తోటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

HEAVY RAIN in Warangal
అకాల వర్షం... అన్నదాతలకు అపార నష్టం

By

Published : Mar 19, 2020, 10:55 PM IST

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దాదాపు అరగంటసేపు ఈదురుగాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం కురిసింది. చెట్ల కొమ్మలు స్తంభాలపై పడటం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మామిడి, వరిపంటలకు నష్టం వాటిల్లింది. జఫర్ ఘడ్ మండలంలోనూ భారీగా వర్షం కురిసింది. ఇటు వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేటలోనూ కొంతసేపు వడగళ్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లా...గూడూరు, కేసముద్రంలో కూడా పలు చోట్ల వర్షం కురిసింది. వర్షం ధాటికి నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

అకాల వర్షం... అన్నదాతలకు అపార నష్టం

ఇదీ చూడండి:నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details