తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాజిక సమస్యలే శంకర్​ పాటల బాణీలు - jangon sanker

ఆయన సాహిత్యానికి సామాజిక అంశాలే ధాతువులు. ప్రజా సమస్యలే పాట వస్తువులు. పేదల కన్నీళ్లే ఆయన సంగీతానికి ముడిసరుకు. అక్షరాలను అద్ది బాణీలు సమకూర్చి తన గాత్రంతో లోకానికి తెలియజేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. జనగామ జిల్లాకు చెందిన శంకర్ ఇటీవల వంద గేయాలతో రచించిన జన చైతన్యరాగం ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయనకు అంకితమిచ్చారు.

సామాజిక సమస్యలే పాటకు బాణీలు

By

Published : Apr 17, 2019, 4:17 PM IST

జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కొత్తపల్లికి చెందిన జనగామ శంకర్ తన రచనలు, గానంతో సామాజిక చైతన్యం తీసుకొస్తున్నారు. తన గాత్రంతో ఇప్పటికే చాలా ప్రదర్శనలిచ్చి జ్ఞాపికలు, సన్మానాలు పొందారు. సాహిత్యానికి అలంకరణగా గాత్రం కుదిరి దానికి తగ్గ సంగీతముంటే ఆ పాట ఎలాంటి వారినైనా మెప్పిస్తుందనటానికి ఈయన పాట ఉదాహరణ. ఇప్పటికి వెయ్యికి పైగా పాటలు రచించి తనదైన గుర్తింపు పొందాడు జనగామ శంకర్​.

సామాజిక అంశాలే పాట వస్తువులు

తను ఏడో తరగతి నుంచే పాటలు రాయడం ప్రారంభించానని శంకర్​ తెలిపారు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు బాణీలు సమకూర్చుకుని పాటలు పాడటంలో నేర్పరితనం సంపాదించాడు.

తోటి కళాకారుడు నరేశ్​తో కలిసి చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల వంద గేయాలతో రచించిన జన చైతన్య రాగం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు అంకితమిచ్చారు.

ఇప్పటివరకు జన చైతన్యం, వెలుగు వెలిగించు, అమ్మ పాట లాంటి అనేక పాటలను రచించి అచ్చువేయించారు. ఆడియో క్యాసెట్ల రూపంలో కూడా అందుబాటులో ఉంచారు.

సామాజిక సమస్యలే పాటకు బాణీలు

ఇవీ చూడండి: చెల్లిని ప్రేమించాడు.. వద్దంటే చంపబోయాడు..

ABOUT THE AUTHOR

...view details