తెలంగాణ

telangana

ETV Bharat / state

అది బడి కాదు... ప్రకృతి అందాలు, కళాత్మక చిత్రాలకు నిలయం.. - school

అరకొర వసతులు.. సమయానికి రాని ఉపాధ్యాయులు.. అంతంతమాత్రం వచ్చే విద్యార్థులు ఇదే ప్రభుత్వ పాఠశాలలపై మీ అభిప్రాయాలా.. అయితే ఒక్కసారి.. జనగామ జిల్లా చెన్నూరు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలను చూసిరావాల్సిందే.. ఎందుకంటే ఉద్యానవనాన్ని తలపించే చిత్రాలయాన్ని తలపిస్తుంది ఈ విద్యాలయం.

అది బడి కాదు... ప్రకృతి అందాలు, కళాత్మక చిత్రాలకు నిలయం..

By

Published : Aug 30, 2019, 1:04 AM IST

అది బడి కాదు... ప్రకృతి అందాలు, కళాత్మక చిత్రాలకు నిలయం..

అక్కడ జాతీయ నాయకులు విగ్రహాలుంటాయ్​ కానీ ప్రభుత్వ కార్యాలయం కాదు.. వేయికి పైగా మొక్కలుంటాయి కానీ నర్సరీ కాదు.. పీఎస్​ఎల్​వీ నమూనా రాకెట్ ఉంటుంది కానీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం కాదు.. గోడలపై రంగురంగుల చిత్రాలుంటాయి కళామతల్లి నిలయం కాదు... ఇది నేటి బాలలే రేపటి భావిభారత పౌరులనే నినాదంలో ముందుకెళ్తున్న చెన్నూరు జిల్లా పరిషత్​ పాఠశాల..

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు జిల్లా పరిషత్​ పాఠశాల ఉత్తమ విద్యాలయానికి ప్రతీక. 280 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులతో విద్యారంగంలో వినూత్న ఒరఒడికి శ్రీకారం చుడుతోంది. అక్కడి వాతావరణం, తరగతి గదులు, పాఠశాల గోడలే సగం విద్యాబుద్ధులు నేర్పిస్తాయి. బడి గోడలు చూస్తేనే తెలిసిపోతుంది.. విద్యార్థులు ఎంత నేర్పరులో.. దాని వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంత ఉందో..

చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆనాటి నాగరికతపై స్వయంగా విద్యార్థులే గీసిన చిత్రాలు ఉన్నతాధికారులను సైతం మెప్పించాయి. సర్కారు బడులంటే ఉన్న చెడు అభిప్రాయాన్ని పటాపంచెలు చేస్తూ స్వచ్ఛభారత్​, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది ఈ సర్కారు బడి.. సర్కారు బడులన్నీ ఇదే తీరుతో పనిచేస్తే.. ప్రతీ బడి మరో చెన్నూరు జిల్లా పరిషత్​ పాఠశాలగా అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసుగంధం గుబాళిస్తుంది.

ఇదీ చూడండి: సర్కారు బడిలో కంప్యూటర్​ చదువులు

ABOUT THE AUTHOR

...view details