తెలంగాణ

telangana

ETV Bharat / state

కరాటేలో రాటుదేలుతున్నారు - janagama

అత్యవసర సమయంలో ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తామే ఎదిరించే స్థాయికి చేరుకోవడంపై దృష్టి సారిస్తున్నారు నేటి విద్యార్థులు. ముఖ్యంగా స్వీయ రక్షణ విద్య కరాటేపై ఎక్కవ మంది చిన్నారులు మక్కువ చూపుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా కరాటే శిక్షణనిస్తూ చురకత్తుల్లా తీర్చిదిద్దుతున్నారు బాలునాయక్​.

free-karate-couching-

By

Published : May 25, 2019, 3:27 PM IST

జనగామ జిల్లా పాలకుర్తి జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు కరాటేలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు బాలునాయక్​. కొన్నేళ్లుగా ఉచిత శిక్షణలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేశారు. ఈయన శిక్షణలో రాటుదేలిన ఎంతో మందిని జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఈయన దగ్గర శిక్షణ పొందిన పలువురు శిక్షకులుగా మారారు.

ధైర్యంగా వెళ్తున్నాం

నిత్యం ఉదయం, సాయంత్రం పాలకుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఆత్మరక్షణ విద్యలో తర్ఫీదునిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి నుంచి బైటకు రావడానికే బయపడే తామంతా ఇప్పడు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లగలం అంటున్నారు విద్యార్థులు.

కరాటే కేవలం ఆపత్కాల సమయంలో ఆత్మరక్షణకే కాదు. ఆరోగ్యం మెరుగుపర్చుకోవడానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు శిక్షకుడు బాలునాయక్​. ప్రభుత్వ సాయం అందిస్తే మరింత మందిని తీర్చిదిద్దుతామంటున్నారు. విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ఇలాంటి ఆత్మరక్షణ విద్యలో పట్టు సాధించడం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు.

కరాటేలో రాటుదేలుతున్నారు
ఇదీ చదవండి: చిట్టి చేతులు... కరాటే విద్యలో అసామాన్యులు

ABOUT THE AUTHOR

...view details