జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా సోకింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణి, గన్‌మెన్, వంటమనిషి, డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇప్పటికే కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యే యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్ - కరోనా వైరస్ వార్తలు
జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకి హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా... ఆయన సతీమణికి కూడా కొవిడ్-19 నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే డ్రైవర్, గన్‌మెన్, వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా
ముత్తిరెడ్డి ఇంట్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారందరిని హోంక్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. కరోనా సోకినా ఆరోగ్యంగానే ఉన్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సతీమణి తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు