Farmers preparing pady seedlings: వరి సాగుపై గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యాసంగి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెబుతోందని... రైతులు నష్టాలు మూటగట్టుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. కొనుగోలు కేంద్రాలూ ఉండబోవని కరాఖండిగా చెప్పింది. కానీ జనగామ జిల్లా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. చిల్పూరు, స్టేషన్ ఘన్‌పూర్, తరిగొప్పుల, నర్మెట, దేవరుప్పుల తదితర మండలాల్లో రైతులు యాంసంగి కోసం నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.
వరి తప్ప మరొకటి సాగు చేయలేం..
Farmers towards paddy:నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు... వరికి బదులు ఇంకేమి పండిస్తామంటూ రైతలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు పొలం వేయడంతో ఇప్పుడు వేరే పంటలు పండించే పరిస్థితి లేదని చెబుతున్నారు. వరి తప్ప మరొకటి సాగు కాదని రైతులు అంటున్నారు.