జనగామ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులతో కూడిన వానకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి.
అకాల వర్షానికి అన్నదాతలు కుదేలు - PADDY FARMERS GETTING LOSE DUE TO RAIN
అకాల వర్షానికి అన్నదాతలు కుదేలవుతున్నారు. వానకు ధాన్యం తడిసి రైతన్నలకు నష్టాలు ఎదురవుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
అకాల వర్షానికి అన్నదాతలు కుదేలు
కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. స్తంభాలు విరిగి పోగా.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ