తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రికి 30 వేల విలువైన సామగ్రి విరాళం - తెలంగాణ తాజా వార్తలు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ మదార్ రూ.30 వేల విలువైన సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు.

government hospital at palakurthi
ప్రభుత్వ ఆసుపత్రికి మాస్కులు, థర్మామీటర్లు అందజేత

By

Published : May 26, 2021, 5:59 PM IST

ఎన్​95 మాస్కులు, శానిటైజర్లు, ఇన్​ఫ్రా రెడ్ థర్మామీటర్లు, ఫేస్​షీల్డ్​లను పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి జనగామ జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ మదార్ ఉచితంగా అందించారు. పాలకుర్తి మండల కేంద్రంలో కరోనా నియంత్రణకై ప్రభుత్వ ఆసుపత్రికి 30 వేల రూపాయల విలువైన సామగ్రిని డాక్టర్లు ప్రియాంక, యామినిలకు ఆయన పంపిణీ చేశారు.

సోడియం హైపోక్లోరైట్ ద్రావణం, శానిటేషన్ కోసం పంపులు, హ్యాండ్ శానిటైజర్లు, తదితర వస్తువులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రియాంక, యామిని, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


ఇదీ చూడండి:తక్షణమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించండి: రేవంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details